జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. ఈ క్రమంలో కరోనా మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2020 | 9:54 AM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. ఈ క్రమంలో కరోనా మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారి కోసం సీహెచ్‌సీ స్థాయిలోనే 5–10 బెడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఒకస్థాయి కేసులకు సీహెచ్‌సీలోనే వైద్యం అందించాలని, పరిస్థితి విషమిస్తే కోవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న సీఎం జగన్‌ తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సూచిస్తూ, పలు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్న దానిపై అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి. కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోవాలని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలని, ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Also Read: ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?