నాన్న చ‌నిపోయాడ‌ని రైలు కింద‌ప‌డి అక్కా చెల్లెళ్ల ఆత్మ‌హ‌త్య‌

నాన్న చ‌నిపోయాడ‌ని రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అక్కా చెల్లెళ్లు. ఈ ఘ‌ట‌న క‌మ‌లాపురం మండ‌లం యార్ర‌గుడిపాడు గ్రామం వ‌ద్ద చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులో వైఎంఆర్ కాలనీలోని నివాస‌ముండే బాబురెడ్డి, స్థానికంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా..

నాన్న చ‌నిపోయాడ‌ని రైలు కింద‌ప‌డి అక్కా చెల్లెళ్ల ఆత్మ‌హ‌త్య‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2020 | 11:30 AM

నాన్న చ‌నిపోయాడ‌ని రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అక్కా చెల్లెళ్లు. ఈ ఘ‌ట‌న క‌మ‌లాపురం మండ‌లం యార్ర‌గుడిపాడు గ్రామం వ‌ద్ద చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులో వైఎంఆర్ కాలనీలోని నివాస‌ముండే బాబురెడ్డి, స్థానికంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా ప‌ని చేస్తూంటారు. ముందురోజు బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు బాబు రెడ్డి. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అల్లుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు బాబు రెడ్డి. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలు కింద ప‌డి కుమార్తె శ్వేతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. అక్క చనిపోయిందని చెల్లెలు సాయి సూసైడ్ చేసుకుంది. కాగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న‌ స్థానికంగా అంద‌రినీ క‌లిచివేస్తుంది. వెంట‌నే అల్లుడిని అదుపులోకి తీసుకుని ఉరి శిక్ష వేయాల‌ని బాబు రెడ్డి బంధువులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

Read More:

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు