ఐరాస మండలిలో భారత్ కు స్థానం.. తిరుమూర్తి విజయం

ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు స్థానం లభించింది. . నాన్-పర్మనెంట్ సీటును దక్కించుకుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఎన్నికలో మొత్తం 192 ఓట్లకు గాను భారత శాశ్వత ప్రతినిధి టీఎస్. తిరుమూర్తికి 184 ఓట్లు లభించాయి.  ఈ హోదాలో..

ఐరాస మండలిలో భారత్ కు స్థానం.. తిరుమూర్తి విజయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 2:35 PM

ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు స్థానం లభించింది. . నాన్-పర్మనెంట్ సీటును దక్కించుకుంది. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఎన్నికలో మొత్తం 192 ఓట్లకు గాను భారత శాశ్వత ప్రతినిధి టీఎస్. తిరుమూర్తికి 184 ఓట్లు లభించాయి.  ఈ హోదాలో భారత రెండేళ్ల కాలపరిమితి వచ్ఛే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఐదుగురు శాశ్వత సభ్యులు, 10 మంది నాన్-పర్మనెంట్ సభ్యులతో కూడిన ఐరాస లో  ఇండియాకు తాజాగా ఈ స్థానం దక్కడం విశేషం. కనీవినీ ఎరుగని గ్లోబల్ సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ అద్భుత నాయకత్వానికి తన ఎంపిక ఓ ‘ఫిటింగ్ టెస్టామెంట్’ అని తిరుమూర్తి అభివర్ణించారు. ఐరాస లోని సభ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కూడా తన ఎంపిక తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరాస మండలికి ఇండియా ఒక విశ్వసనీయతను, జవాబుదారీని తెస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. మండలిలో    భారత రీ ఎంట్రీ సభ్యదేశాల మధ్య తులనాత్మకతను, సంఘీ భావాన్నీ కూడా తేగలదని కూడా ఆయన అన్నారు.   గ్లోబల్ సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సెక్యూరిటీల విషయంలో ఐరాస వహించవలసిన పాత్రపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడిన నేపథ్యంలో… తిరుమూర్తి ఎన్నిక ఆ లోపాన్ని తీర్చగలదని భావిస్తున్నారు.   కాగా’మండలి లో భారత్ కు సభ్యత్వం లభించడంతో పాకిస్తాన్ గుర్రుగా ఉంది. ఐరాసలో తనకు ముఖ్యంగా చైనా వత్తాసుగా ఉన్నప్పటికీ.. ఇండియా ఈ తరుణంలో ఈ స్థానాన్ని దక్కించుకోవడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది.

కాగా-నిజానికి తిరుమూర్తి ఎన్నికకు భారత విదేశాంగ మంత్రి ఎస్, జైశంకర్ విశేష కృషి చేశారు. భారత విదేశాంగ వ్యవహారాల్లో తిరుమూర్తికి ఎంతో అనుభవం ఉంది. తనకు ఆయన నుంచి లభించిన  సహకారానికి తిరుమూర్తి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..