ఫ్లాష్ న్యూస్: 300 మంది నర్సులు రాజీనామా..! కారణమేంటంటే..?

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. కోవిద్‌-19 కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతుంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే 300 మందికి పైగా నర్సులు తమ

ఫ్లాష్ న్యూస్: 300 మంది నర్సులు రాజీనామా..! కారణమేంటంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2020 | 5:04 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. కోవిద్‌-19 కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతుంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే 300 మందికి పైగా నర్సులు తమ ఉద్యోగాలను వీడి మణిపూర్‌, త్రిపుర, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. నర్సులు అనూహ్యంగా విధులకు దూరమవడంతో ఆయా ఆస్పత్రుల్లో రోగుల సేవలకు ఆటంకం ఎదురైంది.

వివరాల్లోకెళితే.. గత వారం 185 మంది నర్సులు మణిపూర్‌కు వెళ్లారు. ఇక శనివారం 169 మంది నర్సులు స్వస్థలాలకు వెళ్లారు. వీరిలో 92 మంది మణిపూర్‌కు చెందిన వారు కాగా, 32 మంది ఒడిషా..43 మంది త్రిపుకు చెందిన వారని కోల్‌కతా నగరానికి చెందిన ప్రైవేట్‌ ఆస్పత్రుల వర్గాలు తెలిపాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు తూర్పు భారత ఆస్పత్రుల సంఘం (ఏహెచ్‌ఈఐ) లేఖ రాసింది.

మరోవైపు.. నర్సులు ఎందుకు హఠాత్తుగా విధులకు రాజీనామా చేశారనేదానిపై స్పష్టమైన కారణం తెలియరాలేదు. కాగా.. భద్రతకు సంబంధించిన ఆందోళన, తల్లితండ్రుల ఒత్తిడితోనే తాను ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని మణిపూర్‌ తిరిగి వచ్చిన ఓ నర్సు వ్యాఖ్యానించారు.

Also Read: తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..