‘చంద్రయాన్ 2’ను ప్రత్యక్షంగా వీక్షించండి: ఇస్రో ఆఫర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న చంద్రయాన్ 2 ఈ నెల 15న తెల్లవారుజామున 2.51గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుండగా.. దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రయోగాన్ని చూసేందుకు 10వేల మందికి అవకాశం కల్పిస్తోన్న ఇస్రో.. అందుకు గురువారం నుంచి వారి అఫిషియల్ వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్వో.జీవోవీ.ఐఎన్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఇందుకోసం 10వేల మంది సామర్థ్యంతో గ్యాలరీని కూడా […]

‘చంద్రయాన్ 2’ను ప్రత్యక్షంగా వీక్షించండి: ఇస్రో ఆఫర్
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 10:12 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న చంద్రయాన్ 2 ఈ నెల 15న తెల్లవారుజామున 2.51గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుండగా.. దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రయోగాన్ని చూసేందుకు 10వేల మందికి అవకాశం కల్పిస్తోన్న ఇస్రో.. అందుకు గురువారం నుంచి వారి అఫిషియల్ వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్వో.జీవోవీ.ఐఎన్) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఇందుకోసం 10వేల మంది సామర్థ్యంతో గ్యాలరీని కూడా నిర్మించనుంది. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఆన్‌లైన్‌లోనే లభించనుంది. కాగా ఇస్రో ఇదివరకు చేసిన ప్రయోగాలన్నీ టీవీల్లో మాత్రమే చూసే అవకాశం ఉండేదన్న విషయం తెలిసిందే.