తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభం..
కరోనా వైరస్ కారణంగా విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ విద్యాశాఖ ఆన్లైన్ తరగతులకు నిర్వహించేందుకు సిద్దమైంది.
కరోనా వైరస్ కారణంగా విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు రంగం సిద్దం చేస్తుండగా. తెలంగాణ విద్యాశాఖ కూడా అదే కోవలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు సిద్దమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ డీఈఓ వెల్లడించారు. జూన్ చివరి వారం నుండి యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మొదటిగా పదో తరగతి విద్యార్ధులతో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన తరగతులకు నిర్వహించనున్నారు. రికార్డెడ్, లైవ్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్ధులకు పాఠాలను బోధించనున్నారు. కాగా, త్వరలోనే ఆన్లైన్ తరగతుల కోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!
సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..
బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..