ఈ రోజు ఉల్లి మార్కెట్ ధర ఎంతో తెలుసా…?

Onion Price : ఉల్లి కోసినా ఘాటె… కొన్నా ఘాటు అన్నట్లే ఉంది. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి‌. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు హడలిపోతున్నారు. చాలా చోట్ల కిలో ఉల్లి ధర రూ. 100 ను చేరుకుంది.కడపజిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి‌. నెలరోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లిధర… ప్రస్తుతం ధర మంట పుట్టిస్తోంది. కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ.90లకు పలుకుతోంది. ఈ ధరలు రానున్న […]

ఈ రోజు ఉల్లి మార్కెట్ ధర ఎంతో తెలుసా...?
Follow us

|

Updated on: Oct 23, 2020 | 10:06 AM

Onion Price : ఉల్లి కోసినా ఘాటె… కొన్నా ఘాటు అన్నట్లే ఉంది. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి‌. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు హడలిపోతున్నారు. చాలా చోట్ల కిలో ఉల్లి ధర రూ. 100 ను చేరుకుంది.కడపజిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి‌. నెలరోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లిధర… ప్రస్తుతం ధర మంట పుట్టిస్తోంది. కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ.90లకు పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉల్లిధరలు కట్టడి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కిలో ఉల్లి కేవలం రూ. 45 మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా ఉల్లి సాగయ్యే రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. దాంతో ఉల్లి ధరలు రెట్టింపయ్యాయి. మరోవైపు వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి… ఉల్లిపాయ ధరలను అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని చాలా రైతు బజార్లలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుండి ఉల్లిపాయలు సరఫరా అవుతాయి. నగరంలోని ప్రధాన మార్కెట్లకు ఉల్లిపాయల సరఫరా గత నెల నుండి దాదాపు సగానికి తగ్గింది. మాదన్నపేట మార్కెట్లో ఉల్లిపాయ ధర ఈ నెల ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ .2,800 కు పెరిగింది. ఉల్లిపాయ రాక తగ్గిపోయి 2,835 క్వింటాళ్లకు పడిపోయింది. సెప్టెంబర్ ప్రారంభంలో ఉల్లి సరఫరా 5,139 క్వింటాళ్లుగా ఉంది. వర్షాలు, వరదలు ఇదే స్థితిలో కొనసాగితే, ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.