కరోనా సోకిన వారు మానసికంగా కుంగిపోతున్నారు…!
కరోనా వైరస్ కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంది.. కరోనా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. కరోనా వైరస్ సోకితే అది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే..
కరోనా వైరస్ కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంది.. కరోనా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. కరోనా వైరస్ సోకితే అది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే.. ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.. తాజాగా వైరస్ మానసిక సమస్యలను కూడా కలిగిస్తున్నట్టు వెల్లడయ్యింది.. కరోనా వైరస్ మెదడుపై ప్రభావం చూపడంతో పాటుగా అనేక మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయట! చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారట! మనోవ్యధతో కుమిలిపోతున్నారట! అమెరికాలోని వైద్య పరిశోధన సంస్థలు కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. కరోనా సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మానసిక వ్యాకులతో బాధపడుతున్నారని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి..మూడు నెలలోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అంటున్నాయి..