వీడియో: భోజనం సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎక్కడో తెలుసా..?

రానున్న రోజుల్లో రోబో యుగం రాబోతోంది. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. తాజాగా ఒడిశాలోని ఓ హోటల్‌లో రోబోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రోబో చెఫ్ హోటల్ ఇప్పుడు […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:27 am, Thu, 17 October 19
వీడియో: భోజనం సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎక్కడో తెలుసా..?

రానున్న రోజుల్లో రోబో యుగం రాబోతోంది. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. తాజాగా ఒడిశాలోని ఓ హోటల్‌లో రోబోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రోబో చెఫ్ హోటల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఆ రెస్టారెంట్‌లో రెండు రోబోలు కస్టమర్లకు భోజనం సర్వ్ చేస్తున్నాయి. ఈ రోబోలు భారత్‌లోనే తయారయ్యాయి. రోబోలకు చంపా, చమేలి అనే పేర్లు పెట్టినట్లు హోటల్ ఓనర్ జీత్ బాసా తెలిపారు. ఈశాన్య భారతంలో రోబోలతో సర్వ్ చేస్తున్న తొలి హోటల్ తమదే అని అతను చెప్పాడు. రాడార్ల ఆధారంగా రోబోలు పనిచేస్తున్నాయి. చంపా, చమేలి అనే రోబోలు.. హోటల్‌కు వస్తున్న కస్టమర్లకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రోబోలకు ఒడిశా భాషలో మాట్లాడతాయి.