ఇక నుంచి సచివాలయాల్లోనే రేషన్ కార్డులు..!

రాష్ట్రంలోని పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందిచేలా సరికొత్త విధానాన్ని అధికారులు రూపొందించగా.. దీనికి సీఎం వైఎస్ జగన్ నుంచి ఆమోదముద్ర లభించింది....

ఇక నుంచి సచివాలయాల్లోనే రేషన్ కార్డులు..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 8:10 AM

రాష్ట్రంలోని పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందిచేలా సరికొత్త విధానాన్ని అధికారులు రూపొందించగా.. దీనికి సీఎం వైఎస్ జగన్ నుంచి ఆమోదముద్ర లభించింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే జారీ చేసే విధానాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది.

అటు రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి 10,15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనుండగా.. ఒక్కో సంచీ తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..

షాకింగ్: భారత్‌లో 198 రకాలుగా కరోనా రూపాంతరం!