బ్రిటన్ నుంచి ఇజ్రాయెల్, ఐర్లండ్ దేశాలకు వ్యాపించిన న్యూ స్ట్రెయిన్ వైరస్, ఆశాకిరణమైన మోడెర్నా వ్యాక్సిన్
బ్రిటన్ లో తలెత్తిన మ్యుటెంట్ స్ట్రెయిన్ కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కేసులు తమ దేశాల్లో బయటపడ్డాయని నార్తర్న్ ఐర్లాండ్, ఇజ్రాయెల్ ప్రకటించాయి.
బ్రిటన్ లో తలెత్తిన మ్యుటెంట్ స్ట్రెయిన్ కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కేసులు తమ దేశాల్లో బయటపడ్డాయని నార్తర్న్ ఐర్లాండ్, ఇజ్రాయెల్ ప్రకటించాయి. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఇది సోకినట్టు గుర్తించామని ఐర్లండ్ ప్రకటించగా..ఇంగ్లాండ్ నుంచి తమ దేశంలో ప్రవేశించిన నలుగురికి ఈ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. కరోనా వైరస్ క్వారంటైన్గ్ కేంద్రంగా మార్చిన ఓ హోటల్ కి ముగ్గురిని తరలించామని, మరో కేసు వివరాలు తెలియాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కొత్త మహమ్మారి తలెత్తిన తరుణంలో మోడెర్నా సంస్థ విశిష్టమైన ప్రకటన చేసింది. నూతన వైరస్ స్ట్రెయిన్ నుంచి రక్షించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేట్టు తమ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ప్రకటించింది. పైగా ఇందుకు అనుగుణంగా మరిన్ని టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
అటు-ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలు కూడా తమ టీకామందులు కొత్త వైరస్ ను నీరు గార్చవచ్చునని భావిస్తున్నాయి. ఇక బ్రిటిష్ హెల్త్ ఏజెన్సీ..తమ రాపిడ్ కోవిడ్ 19 టెస్టులు నూతన వైరస్ ను గుర్తించగలవని , ఇవి జయప్రదంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. మొత్తం మీద వివిధ రకాల టీకామందులు ఈ లేటెస్ట్ వైరస్ ని అదుపు చేయగలవనే భావిస్తున్నారు.