ఎస్‌బీఐ న్యూ రూల్… ఇకపై ఏటీఎంలలో ఛార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయొచ్చు!

ఏటీఎంలలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే.. చార్జీల మోత మోగిపోతోంది. పరిమితి ధాటి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే అన్ని సార్లు ఛార్జీలు పడుతుంటాయి. దీంతో జనాల జేబులు ఖాళీ అవ్వక తప్పదు. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. మీరు ఎన్నిసార్లయినా డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇక ఎస్‌బీఐ అందిస్తున్న ఈ సరికొత్త అవకాశాన్ని […]

  • Ravi Kiran
  • Publish Date - 4:09 pm, Wed, 6 November 19
ఎస్‌బీఐ న్యూ రూల్... ఇకపై ఏటీఎంలలో ఛార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయొచ్చు!

ఏటీఎంలలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే.. చార్జీల మోత మోగిపోతోంది. పరిమితి ధాటి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే అన్ని సార్లు ఛార్జీలు పడుతుంటాయి. దీంతో జనాల జేబులు ఖాళీ అవ్వక తప్పదు. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. మీరు ఎన్నిసార్లయినా డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇక ఎస్‌బీఐ అందిస్తున్న ఈ సరికొత్త అవకాశాన్ని కేవలం ఆ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే సద్వినియోగం చేసుకోవచ్చు. అదలాగో ఇప్పుడు చూద్దాం..

ఎస్‌బీఐ అకౌంట్ ఉన్నవారు యోనో క్యాష్ ఫెసిలిటీ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా అధిక చార్జీలు చెల్లించకుండా ఎన్నిసార్లయినా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎస్బీఐ. ఈ యోనో యాప్ ద్వారా మీరు ఏటీఎం కార్డు అవసరం లేకుండానే ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు… అంటే కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్ అనమాట. ఇక ఈ యాప్‌తో ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత 6 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ యోనో క్యాష్‌పైన క్లిక్ చేసి డబ్బులు డ్రా చేసుకోండి.. అయితే ఇది కేవలం యోనో క్యాష్ పాయింట్లున్న ఏటీఎంలలో మాత్రమే ఛార్జీలు లేకుండా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. దీని ద్వారా కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్ పెరుగుతాయని ఎస్‌‌బీఐ భావిస్తోంది. కాగా ఈ యాప్ ద్వారా రోజుకి రూ.20,000, ఒకేసారి రూ.10,000 వరకు డ్రా చేసుకోవచ్చు.