Bharat Bandh : హైదరాబాద్ నగరంలో నిరసనలకు నో ఎంట్రీ..అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు
కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు...
కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పలు రైతు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు కూడా బంద్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు.
సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుకోవాలని సూచించారు. బంద్ అనుకూల, వ్యతిరేక నేతలపై ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది.