పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ కొడుకు హల్ చల్..
మద్యంమత్తులో తానేం చేస్తున్నాడో మరిచి పోయాడు. తాగిన మైకంలో ఓ వ్యక్తి తల పగులగొట్టినందుకు స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు. దీంతో రెచ్చిపోయి.. పోలీస్ స్టేషన్ లోనే వీరంగం సృష్టించాడు ఓ రాజకీయనాయకుడి సుపుత్రుడు. మద్యం మత్తులో మాజీ సర్పంచ్ కుమారుడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశాడు. శంకర్ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకెముందీ […]

మద్యంమత్తులో తానేం చేస్తున్నాడో మరిచి పోయాడు. తాగిన మైకంలో ఓ వ్యక్తి తల పగులగొట్టినందుకు స్టేషన్ తీసుకొచ్చారు పోలీసులు. దీంతో రెచ్చిపోయి.. పోలీస్ స్టేషన్ లోనే వీరంగం సృష్టించాడు ఓ రాజకీయనాయకుడి సుపుత్రుడు.
మద్యం మత్తులో మాజీ సర్పంచ్ కుమారుడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేశాడు. శంకర్ అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో పోలీసులు మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకెముందీ మందు మైకంలో మాజీ సర్పంచ్ కొడుకునే పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారంటూ రెచ్చిపోయాడు. విచారణ జరుపుతున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. దీంతో రాజీవ్ నాయుడుని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.




