KGF 2: సంజయ్‌దత్ లుక్ లీక్.. ‘అధీర’ అదరగొట్టేస్తున్నాడుగా..!
కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విలన్‌గా ఈ నటుడు కనిపించబోతున్నారు. గతేడాది ఈ సీక్వెల్ నుంచి సంజయ్ లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేసినప్పటికీ.. తాజాగా ఆయనకు సంబంధించిన మరో లుక్ లీక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవర్‌ఫుల్ లుక్‌లో అదరగొట్టేస్తున్నారు సంజయ్ దత్. అయితే ఇది ‘కేజీఎఫ్ 2’లోనిదా..? కాదా..? అన్నది మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించాల్సిందే.
కాగా కేజీఎఫ్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న కేజీఎఫ్ 2లో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను అన్నీ కుదిరితే అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read This Story Also: చెత్త రహిత నగరాల జాబితా.. ఏపీలోని ఆ నగరాలకు 3 స్టార్ రేటింగ్..!



