AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సుల గోల… యోగికి, ప్రియాంకకు మధ్య కోల్డ్ వార్

వలస కూలీలకు బస్సుల ఏర్పాటు విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఢిల్లీలో చిక్కు బడిన యూపీకి చెందిన మైగ్రైంట్ వర్కర్స్ తరలింపునకు తాము వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తామని, వారిని మీ రాష్టంలోనికి అనుమతించాలని ప్రియాంక గాంధీ.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కి లేఖ రాశారు. ఇందుకు మీ బస్సుల వివరాలు పంపాలని యోగి.. ఆమెకు మరో లేఖ పంపారు, కానీ.. తాజాగా […]

బస్సుల గోల... యోగికి, ప్రియాంకకు మధ్య కోల్డ్ వార్
Umakanth Rao
| Edited By: |

Updated on: May 19, 2020 | 6:31 PM

Share

వలస కూలీలకు బస్సుల ఏర్పాటు విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఢిల్లీలో చిక్కు బడిన యూపీకి చెందిన మైగ్రైంట్ వర్కర్స్ తరలింపునకు తాము వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తామని, వారిని మీ రాష్టంలోనికి అనుమతించాలని ప్రియాంక గాంధీ.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కి లేఖ రాశారు. ఇందుకు మీ బస్సుల వివరాలు పంపాలని యోగి.. ఆమెకు మరో లేఖ పంపారు, కానీ.. తాజాగా ఆమె పంపిన బస్సుల జాబితా అంతా ఫ్రాడ్ అని, వీటి రిజిస్ట్రేషన్  నెంబర్లలో చాలావరకు ఆటోలు, టూ వీలర్లు, గూడ్స్ క్యారియర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లని అయన ఆరోపించారు. నిజానికి ప్రియాంక అభ్యర్థనను మన్నించి యోగి ప్రభుత్వం నిన్న పన్నెండు వేల బస్సులను ఏర్పాటు చేసింది. అయితే మీరు  వేరుగా బస్సులను అరెంజ్ చేసినప్పుడు మా రాష్ట్రం నుంచి బస్సులు ఖాళీగా ఎలా వస్తాయని ప్రియాంక ప్రైవేటు కార్యదశి సందీప్ సింగ్ మంగళవారం యూపీ ప్రభుత్వానికి లెటర్ రాయడంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.

Follow Us