AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..? తప్పక తెలుసుకోండి..

వర్షాకాలం రాగానే వేడివేడిగా ఏదైనా నాన్ వెజ్ తినాలనే కోరిక కలగడం సహజం. అయితే ఈ కాలంలో చాలా మంది నాన్‌వెజ్ తినడానికి కాస్త సంకోచిస్తారు. ఎందుకంటే వర్షాల వల్ల వాతావరణంలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈ సీజన్‌లో శారీరక శ్రమ తగ్గి మన జీర్ణవ్యవస్థ కూడా కాస్త మందగిస్తుంది. మరి ఇలాంటి సమయంలో చికెన్, మటన్‌లలో మన ఆరోగ్యానికి ఏది మంచిది? దేనిలో ఎలాంటి పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Jul 13, 2026 | 4:41 PM

Share
సులభంగా జీర్ణమయ్యే చికెన్: తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ కోరుకునే వారికి స్కిన్‌లెస్ చికెన్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కండరాల పెరుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను తక్కువ కేలరీలతో అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మటన్‌తో పోలిస్తే చికెన్ శరీరానికి సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే జింక్, ప్రోటీన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా చికెన్ ఎంతో మేలు చేస్తుంది.

1 / 5
పోషకాల గని మటన్: మరోవైపు మటన్ శరీరానికి అవసరమైన విభిన్న రకాల ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులో హై-క్వాలిటీ ప్రొటీన్‌తో పాటు ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇమ్యూనిటీని బలపరుస్తాయి. అయితే చికెన్‌తో పోలిస్తే మటన్‌లో కొవ్వు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కొంతమందిలో కడుపు నొప్పి, గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

2 / 5
గుండె సమస్యలు ఉన్నవారు: మటన్‌లో ఉండే సంతృప్త కొవ్వుల కారణంగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు దీనిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు మటన్‌ను వీలైనంత మితంగా తీసుకోవడం మంచిది. ఒకవేళ ప్రోటీన్ మాత్రమే కావాలనుకుంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. అదే సమయంలో శరీరంలో రక్తం తక్కువగా ఉండి, ఐరన్, విటమిన్ బి12 అవసరమైన వారు వైద్యుల సలహా మేరకు మటన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.

3 / 5
ఈ కాలంలో ఏది తిన్నా ఇదే ముఖ్యం: అయితే వర్షాకాలంలో చికెన్ లేదా మటన్.. వీటిలో ఏది మంచిదనే చర్చ కంటే మనం తినే మాంసం ఎంత శుభ్రంగా ఉందనేది అత్యంత కీలకం. ఎందుకంటే ఈ సీజన్‌లో సరిగ్గా ఉడకని మాంసం తింటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎల్లప్పుడూ నమ్మకమైన, పరిశుభ్రమైన దుకాణాల నుండి మాత్రమే తాజా మాంసాన్ని కొనుగోలు చేయాలి. అలాగే మాంసాన్ని వండేటప్పుడు బాగా ఉడికించి వేడిగా ఉన్నప్పుడే తినడం అలవాటు చేసుకోవాలి.

4 / 5
ఏది బెస్ట్?: వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి పొట్టకు భారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే చికెన్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే.. మితంగా, జీర్ణమయ్యేలా మసాలాలు తగ్గించి వండుకోవాలి. ఏది తిన్నా సరే.. రోడ్డు పక్కన నిల్వ ఉంచిన నాన్‌వెజ్ పదార్థాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తింటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!

పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు

ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..

'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో

12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్