బ్రేకింగ్: నిర్భయ కేసు.. దోషులకు వారం రోజుల గడువు!

నిర్భయ నలుగురు దోషుల మరణ శిక్షపై పటియాల కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ.. కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ చేసింది ఢిల్లీ హైకోర్టు. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టు కూడా సమర్ధించింది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పిటిషన్‌ను న్యాయ స్థానం కోట్టివేసింది. పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్, వినయ్ శర్మలు పిటిషన్ దాఖలు […]

బ్రేకింగ్: నిర్భయ కేసు.. దోషులకు వారం రోజుల గడువు!

నిర్భయ నలుగురు దోషుల మరణ శిక్షపై పటియాల కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ.. కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ చేసింది ఢిల్లీ హైకోర్టు. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ.. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టు కూడా సమర్ధించింది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పిటిషన్‌ను న్యాయ స్థానం కోట్టివేసింది.

పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్, వినయ్ శర్మలు పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. నిర్భయ కేసులో అధికారుల అలసత్వంతోనే రివ్యూ పిటిషన్లపై ఆలస్యం అవుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. నలుగురు దోషులూ.. క్రూరమైన నేరానికి పాల్పడ్డారని న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. కాగా.. కోర్టు తీర్పు ప్రకారం వారం రోజుల తర్వాత నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. వీరు న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తమ ఉరిని తప్పించుకునేందుకు జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు.

Published On - 3:14 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu