కుక్క కోసం రూ. 42 కోట్ల ఖర్చు…

పెంపుడు జంతువులను చాలా మంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు..ఇంట్లో మనుషుల మాదిరిగానే వాటిని కూడా అంతే అప్యాయతతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తల్లడిల్లిపోతారు. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం చేసిన ఖర్చు తెలిస్తే..షాక్‌ తింటారు. అనారోగ్యానికి గురైన తన పెంపుడు కుక్కను కాపాడిన వెటర్నరీ డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కోట్లు ఖర్చుపెట్టారు. ‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ […]

కుక్క కోసం రూ. 42 కోట్ల ఖర్చు...
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Feb 05, 2020 | 3:14 PM

పెంపుడు జంతువులను చాలా మంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు..ఇంట్లో మనుషుల మాదిరిగానే వాటిని కూడా అంతే అప్యాయతతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తల్లడిల్లిపోతారు. అదే కోవకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం చేసిన ఖర్చు తెలిస్తే..షాక్‌ తింటారు. అనారోగ్యానికి గురైన తన పెంపుడు కుక్కను కాపాడిన వెటర్నరీ డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కోట్లు ఖర్చుపెట్టారు.

‘వెదర్‌టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్‌నైల్ పెంపుడు కుక్క పేరు స్కౌట్‌. కొంతకాలంగా స్కౌట్‌ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతోంది. వైద్యులను సంప్రదించగా.. దాని గుండెలో గడ్డ ఉందని, రక్తంలో క్యాన్సర్‌ కణాలు ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. వైద్య తీవ్రత కారణంగా అది బతికే అవకాశాలు కేవలం ఒక శాతమే ఉన్నాయన్నారు. దీంతో డెవిడ్ మ్యాక్‌నైల్ స్కౌట్‌ను యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌‌లో చేర్చారు.

స్కౌట్‌కి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..దానికి కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ, ఇమ్యునోథెరఫీ అందించారు. దీంతో గడ్డ 90 శాతానికి కరిగిపోయి స్కౌట్ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ‘యూనివర్శిటీ ఆఫ్ విస్కోన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌’ డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పేందుకు డెవిడ్ మ్యాక్‌నైల్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికాలోని సూపర్ బౌల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రకటన కోసం రూ.42,93,63,000 ఖర్చుపెట్టారు. కుక్కల్లో ఏర్పడే క్యాన్సర్ గురించి అవగాహన కలిపిస్తూ రూపొందించిన ఈ ప్రకటనలో స్కౌట్‌కు అందించిన చికిత్స గురించి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఆ వెటర్నరీ స్కూల్‌కు విరాళాలు లభిస్తాయని ఆశిస్తున్నానని డెవిడ్ మ్యాక్‌నైల్ పేర్కొన్నారు. డెవిడ్‌ ఉదార స్వభావం, తన కుక్కపై ఉన్న ప్రేమను చూసి.. జంతుప్రేమికులు సైతం విస్తూపోతున్నారు.