పీక్ లెవల్లో మాటల యుద్దం: కేసీఆర్‌ని ఎంత మాటనేశారు?

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మాటల యుద్దం తీవ్రమైంది. పార్లమెంటు ప్రాంగణం వేదికగా రెండు పార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్కుంటూ వార్తలకెక్కుతున్నారు. తాజాగా ఆర్మూరులో పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు.. తెలంగాణకు కేందమిచ్చిన నిధుల విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య మాటల మంటలు సెగరేపాయి. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులేవీ రావడం లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు […]

పీక్ లెవల్లో మాటల యుద్దం: కేసీఆర్‌ని ఎంత మాటనేశారు?
Follow us

|

Updated on: Feb 05, 2020 | 2:50 PM

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మాటల యుద్దం తీవ్రమైంది. పార్లమెంటు ప్రాంగణం వేదికగా రెండు పార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్కుంటూ వార్తలకెక్కుతున్నారు. తాజాగా ఆర్మూరులో పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు.. తెలంగాణకు కేందమిచ్చిన నిధుల విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య మాటల మంటలు సెగరేపాయి.

కేంద్రం నుంచి తెలంగాణకు నిధులేవీ రావడం లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు బీజేపీ ఎంపీ ఆరవింద్. కేంద్రం తెలంగాణకు నిధులు, గ‌ృహాలు మంజూరు చేసిందని సంబంధిత మంత్రి లోక్‌సభలో సమాధానమిచ్చారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణలు మొదలుపెట్టారు.

గ్రామీణ పేద మహిళల పాలిట కేసీఆర్ శాపంగా మారాడని అరవింద్ ఆరోపించారు. గృహ నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా… వాటిని ఖర్చుచేయకుండా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. 2016-17 సంవత్సరానికి 200 కోట్లు పంపిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, నాలుగేళ్ళుగా అయిన ఖర్చుల లెక్కలు చెప్పడం లేదని అరవింద్ అన్నారు. నిధుల మళ్ళింపు బండారం బయటపడుతుందనే.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం లేదని ఆరోపించారు అరవింద్.

బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్లపై రాజ్యసభ సభ్యుడు కేకే స్పందించారు. తెలంగాణలో పేదలకు చెందుతున్న పథకాలను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను అపేందుకు బీజేపీ ఎంపీలు పని చేస్తున్నారని ఆరోపించారు కేకే. తెలంగాణ ప్రజల పొట్ట కొట్టే దిశగా బీజేపీ ఎంపీలో పార్లమెంటులో ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు.

మరోవైపు ఆర్మూరుకు ప్రకటించిన స్పైసిస్ రీజినల్ కార్యాలయం అంశం కూడా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల మంటలు రేపుతోంది. కేంద్రమిచ్చింది పసుపు బోర్డు కాదని, కేవలం రీజినల్ కార్యాలయమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెబుతున్నారు. పసుపు బోర్డు సాధించానని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ అరవింద్ ప్రజలను మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. ‘‘ఇపుడు కేంద్రం ఇచ్చింది పసువు బోర్డు కాదు.. స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ మాత్రమే.. ఇలాంటి రీజినల్ ఆఫీసులు ఇప్పటికే ఆరు ఉన్నాయి…..ఈ ఆఫీసును 2018 లోనే ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ..దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది.. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసింది డివిజనల్ ఆఫీస్ ప్రమోషనల్ ఆఫీస్ మాత్రమే.. కేంద్రం పాచి పోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోంది.. రైతులకు వాస్తవాలు త్వరలోనే అర్ధమవుతాయి’’ అంటూ జీవన్ రెడ్డి అరవింద్‌పై ధ్వజమెత్తారు.