జగన్‌ నిర్ణయానికి భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే విఙ్ఞప్తి

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సైతం తీర్మానం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. మూడు రాజధానులు వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం రాజధానిని త్యాగం చేసిన రాయలసీమ వాసులకు న్యాయం జరగాలంటే కర్నూలులో ఏపీ రాజధాని ఏర్పాటు చేయాలని సదరు వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కర్నూలు నుంచి వైసీపీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల నాని అలియాస్ గంగుల బిజేంద్రారెడ్డి కర్నూలును రాష్ట్ర రాజధానిగా చేయాలని […]

జగన్‌ నిర్ణయానికి భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే విఙ్ఞప్తి
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 05, 2020 | 3:39 PM

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సైతం తీర్మానం చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. మూడు రాజధానులు వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం రాజధానిని త్యాగం చేసిన రాయలసీమ వాసులకు న్యాయం జరగాలంటే కర్నూలులో ఏపీ రాజధాని ఏర్పాటు చేయాలని సదరు వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

కర్నూలు నుంచి వైసీపీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల నాని అలియాస్ గంగుల బిజేంద్రారెడ్డి కర్నూలును రాష్ట్ర రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, సచివాలయంతోపాటు రాష్ట్ర హైకోర్టును కూడా కర్నూలు నగరంలోనే ఏర్పాటు చేయాలన్నారయన. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును చేయాలని, లేకపోతే.. ఏకంగా ఆమరణ దీక్షలకు పూనుకుంటామని బిజేంద్రా రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో ఒకసారి రాజధానిని పోగొట్టుకున్న కర్నూలుకు న్యాయం జరగాలంటే రాజధాని రావాల్సిందేని పట్టుబడుతున్నారాయన.

ఆళ్ళగడ్డలోని మూడు రోడ్ల సెంటర్‌లో వైసీపీ వర్గాలు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి బుధవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రా రెడ్డి (నాని) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలులో రాజధాని కోసం త్వరలో దీక్షలు చేపడతామని ప్రకటించారు.