మళ్ళీ తెరమీదికి దొనకొండ ప్రతిపాదన

ఏపీలో రాజధాని వ్యవహారంపై రెండు నెలలుగా రచ్చ కొనసాగుతూనే వుంది. మూడు రాజధానులను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్.. ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. అయితే, గతంలో రాష్ట్ర రాజధానిగా మారబోతోదంటూ వార్తల్లో చక్కర్లు కొట్టిన ప్రకాశం జిల్లా దొనకొండ మరోసారి తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి దొనకొండ రాజధాని పేరుతో కాకుండా వేరే విధంగా వార్తల్లోకి ఎక్కుతోంది. దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు […]

మళ్ళీ తెరమీదికి దొనకొండ ప్రతిపాదన

ఏపీలో రాజధాని వ్యవహారంపై రెండు నెలలుగా రచ్చ కొనసాగుతూనే వుంది. మూడు రాజధానులను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్.. ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. అయితే, గతంలో రాష్ట్ర రాజధానిగా మారబోతోదంటూ వార్తల్లో చక్కర్లు కొట్టిన ప్రకాశం జిల్లా దొనకొండ మరోసారి తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి దొనకొండ రాజధాని పేరుతో కాకుండా వేరే విధంగా వార్తల్లోకి ఎక్కుతోంది.

దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు పంపింది. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందన్న పరిశ్రమల శాఖ.. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు దొనకొండ అనువైన ప్రాంతమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్- ఇండో డిఫెన్స్ ఎక్స్ పోలో ఈ అంశాలను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా దొనకొండ ప్రాంతం కీలకమని స్పష్టం చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి.. ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్ రెడ్డి తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu