బాబు అధికారంలో వుంటే కరోనా కంట్రోల్

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దమే కాదు.. ట్వీట్ వార్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతోంది. నువ్వొకటంటే.. నేను రెండంటా అన్నట్లుగా వైసీపీ, టీడీపీ నేతలు ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో అర్థం లేని మాటలు కూడా నేతల ట్వీట్లలో దొర్లుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సెటైర్ వేయబోయి మితిమీరి కామెంట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముందుగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన […]

బాబు అధికారంలో వుంటే కరోనా కంట్రోల్

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దమే కాదు.. ట్వీట్ వార్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతోంది. నువ్వొకటంటే.. నేను రెండంటా అన్నట్లుగా వైసీపీ, టీడీపీ నేతలు ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో అర్థం లేని మాటలు కూడా నేతల ట్వీట్లలో దొర్లుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సెటైర్ వేయబోయి మితిమీరి కామెంట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ముందుగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్‌పై గోరంట్ల స్పందించారు. విజయసాయి రెడ్డి చాలా వ్యంగ్యంగా ‘‘యావత్ ప్రపంచమంతా చంద్రబాబు వైపు చూస్తోంది. తుఫాన్లను ఆపగలిగే సత్తా వున్న చంద్రబాబు.. కరోనా వైరస్‌ని కూడా నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది’’ అంటూ ట్వీట్ చేశారు. యావత్ ప్రపంచం అంతా ఆందోళన చెందుతున్న కరోనావైరస్ ఆధారంగా పొలిటికల్ సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.

చంద్రబాబు అధికారంలో వుండి వుంటే కరోనా వైరస్‌ని కంట్రోల్ చేసేందుకు కనీసం ప్రయత్నం అయినా చేసే వారు. అదే జగన్ అధికారంలో వున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా రద్దు చేస్తారు కదా అంటూ రిప్లై ఇచ్చారు గోరంట్ల.

ప్రపంచమంతా సీరియస్‌గా వర్రీ అవుతున్న కరోనా వైరస్‌ ఆధారంగా వైసీపీ, టీడీపీ నేతలు సెటైర్లు వేసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భయంకర వైరస్‌ని కూడా పొలిటికల్ గేమ్‌లో వాడుకోవడమేంటని కామెంట్లు చేస్తున్నారు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. రాజకీయ విమర్శకు ఏ అంశమైనా అనర్హం కాదని చాటుతున్నారు నేతలు.

Published On - 12:53 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu