హర్యానాలో నికిత హత్యపై పెల్లుబికిన ఉద్రిక్తత, ఆందోళనకారులపై పోలీస్ లాఠీ !

హర్యానాలోని బల్లభ్ ఘర్ లో గత నెల 26 న జరిగిన కాలేజీ విద్యార్థిని నికిత తోమర్ హత్య తాలూకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆమెకు న్యాయం జరగాలని, నికిత హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జాతీయ రహదారిలో రాస్తారోకో చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు గాయపడ్డారు. నికిత మర్డర్ ను ఖండిస్తూ 36 కులాలకు చెందిన కమిటీల సభ్యులు మహా పంచాయత్ నిర్వహించారు. ఈ సభకు వారు పోలీసుల […]

  • Umakanth Rao
  • Publish Date - 6:16 pm, Sun, 1 November 20
హర్యానాలో నికిత హత్యపై పెల్లుబికిన ఉద్రిక్తత, ఆందోళనకారులపై పోలీస్ లాఠీ !

హర్యానాలోని బల్లభ్ ఘర్ లో గత నెల 26 న జరిగిన కాలేజీ విద్యార్థిని నికిత తోమర్ హత్య తాలూకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆమెకు న్యాయం జరగాలని, నికిత హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జాతీయ రహదారిలో రాస్తారోకో చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు గాయపడ్డారు. నికిత మర్డర్ ను ఖండిస్తూ 36 కులాలకు చెందిన కమిటీల సభ్యులు మహా పంచాయత్ నిర్వహించారు. ఈ సభకు వారు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తౌసీఫ్, రెహాన్ లను పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. నికితను ఆమె కాలేజీ వద్దే తౌసీఫ్ పిస్టల్ తో కాల్చి చంపాడు. ఈ వీడియో సంచలనం రేపింది.