నైజీరియన్లు వద్ద కరోనా మందు..!

కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి నైజీరియా సైంటిస్టులు తీపి కబురు మోసుకొచ్చారు. కొవిడ్-19కి విరుగుడుగా నైజీరియా శాస్త్ర‌వేత్తల బృంద‌మొక‌టి వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్టు శుక్ర‌వారం స్థానిక మీడియా తెలిపింది.

నైజీరియన్లు వద్ద కరోనా మందు..!
Follow us

|

Updated on: Jun 22, 2020 | 10:07 PM

కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి నైజీరియా సైంటిస్టులు తీపి కబురు మోసుకొచ్చారు.కొవిడ్-19కి విరుగుడుగా నైజీరియా శాస్త్ర‌వేత్తల బృంద‌మొక‌టి వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్టు శుక్ర‌వారం స్థానిక మీడియా తెలిపింది.

కరోనా కరాళనృత్యానికి ప్రపంచం అల్లాడిపోతోంది. దీంతో అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. కళ్లముందు మాయమవుతున్న ప్రాణాలను నిలిపేందుకు వ్యయప్రయాసలు వెచ్చిస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ లెక్కలప్రకారం 120 సంస్థ‌లు వ్యాక్సిన్ అభివృద్ది చేసే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ఇప్పటి వరకు 13 రకాల వ్యాక్సిన్ల‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగించినట్లు సమాచారం. అయితే నైజీరియన్ యూనివర్సిటీ సైటిస్టులు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఆఫ్రికాలో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామ‌ని అడిలెక్ యూనివ‌ర్సిటీలో మెడిక‌ల్ వైరాల‌జీ, ఇమ్యునాల‌జీ, బ‌యో ఇన్ఫ‌ర్మేటిక్స్ ప్ర‌త్యేక నిపుణుడు, డాక్ట‌ర్ ఒల‌డిపో కొల‌వోల్ ప్ర‌క‌టించార‌ని ది గార్డియ‌న్ నైజీరియా తెలిపింది. అయితే, ఇప్పుడప్పుడే జనంలోకి రాదని ఇంకాస్త సమయం పడుతుందని వెల్లడించారు. వ్యాక్సిన్ అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చేందుకు క‌నీసం 18 నెల‌ల స‌మ‌యం ప‌ట్టవచ్చని ఒల‌డిపో. మ‌రిన్ని ట్ర‌య‌ల్స్‌ నిర్వహించిన అనంతరం వైద్యాధికారుల అనుమ‌తులు పొందాల్సి ఉందన్నారు.

వ్యాక్సిన్ క‌నుక్కోవ‌డం వాస్త‌వ‌మేన‌ని ప్రీసియ‌స్ కార్న‌ర్‌స్టోన్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలియ‌స్ ఒలోక్ సైతం నిర్థారించారు. వ్యాక్సిన్ ను చాలా ప్ర‌యోగాలు చేసి విశ్లేషించామని.. ఆఫ్రిక‌న్లే ల‌క్ష్యంగా త‌యారు చేశామని జూలియ‌స్ ఒలోక్ వెల్లడించారు. రోజుల వ్యవధిలో ప్రాణాలను హరిస్తున్న కరోనా మహమ్మారి తరిమేందుకు వ్యాక్సిన్ త్వరగా వస్తే బాగుండని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?