AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రూప్-1 తో సహా.. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన పలు ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు

గ్రూప్-1 తో సహా.. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2020 | 10:31 PM

Share

All The Exams Scheduled in AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన పలు ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ఏపీపీఎస్సి ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ఏపీపీఎస్సి నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్ – 1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు
  • సెప్టెంబర్ 21, 22 అసిస్టెంట్ బిసి/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షలు
  • సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్ స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్ష
  • సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్, పోలీస్ విభాగంలోని టెక్నీకల్ అసిస్టెంట్ నియామక పరీక్ష
  • సెప్టెంబర్ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ నియామక పరీక్షలు
  • సెప్టెంబర్ 23, 24 ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగ పరీక్షలు
  • సెప్టెంబర్ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పరీక్షలు
  • సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలు

Follow Us