తమిళనాడులో ఎన్‌ఐఏ రైడ్స్
తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది. శ్రీలంక ఈస్టర్ పేలుళ్ల కేసు దర్యాప్తులో భాగంగా కోయంబత్తూర్‌లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. ఇతర దర్యాప్తు సంస్థల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ బృందంతో పాటు తమిళనాడు పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇదే కేసులో గత ఏప్రిల్ 28న కేరళలోని పాలక్కడ్, కసరగోడ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందం సోదాలు చేసిన విషయం తెలిసిందే.