కరోనాపై పోరులో.. స్మార్ట్ ఉంగరాలు..!
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనాతో పోరులో ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వ్యాధి కట్టడికోసం బిగ్ డెటా నుంచి ఏఐ దాకా అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు.
కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనాతో పోరులో ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వ్యాధి కట్టడికోసం బిగ్ డెటా నుంచి ఏఐ దాకా అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో ముందు వరుసలో నులుచుని పోరాడేవారు ఎవరైనా ఉన్నారంటే వారు వైద్య సిబ్బంది మాత్రమే. ఈ నేపథ్యంలోనే యూనివర్శిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్), ఔరా స్మార్ట్ రింగ్స్ సంయుక్తంగా స్మార్ట్ ఉంగరాలను రూపొందిచాయి. వీటిని వైద్యులు నిరంతరం ధరించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులపై ముఖ్యంగా ఉష్ణోగ్రతలపై ఓ కన్నేసి ఉంచోచ్చు. కాస్తంత టెంపరేచర్ పెరిగినా సరే..తగు జాగ్రత్తలు తీసుకుని ఐసోలేషన్‌లోకి వెళ్లడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు.
కాగా.. యూసీఎస్‌ఎఫ్ మెడికల్ సెంటర్, జుకర్‌బర్గ్ శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటళ్లలోని 2 వేల మంది సిబ్బంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఉంగరాల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా కరోనా పూర్తి పట్టు లభిస్తుందని అశాభావం వ్యక్తమవుతోంది. ఉంగరం రూపకర్తలైన రెండు సంస్థలూ మరో 15 వేల మందికి ఈ ఉంగారలను ఇవ్వాలని తలపోస్తున్నాయి. వీరి నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఉంగరంలోని ఆల్గోరిథంను మరింత పటిష్ట పరిచి కరోనాకు ముకుతాడు వేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. సాధారణ వ్యక్తులు కూడా వీటిని ధరించడం ద్వారా తమ ఆరోగ్యంపై పూర్తి నిఘా పెట్టోచ్చిని, ఈ వివరాలను వారు ప్రభుత్వంతో పంచుకుంటే కరోనాకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని స్మార్ట్ ఉంగరం చెబుతున్నారు.
[svt-event date=”24/03/2020,8:55PM” class=”svt-cd-green” ]
With the backdrop of COVID-19, Oura is sponsoring research at University of California, San Francisco (UCSF) to study whether physiological data collected by the Oura ring, combined with responses to daily symptom surveys, can predict illness symptoms. The study aims to (1/3)
— Oura (@ouraring) March 23, 2020
[/svt-event]