AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటలోనే 99.99 శాతం బాక్టీరియాను చంపే మాస్క్, కరోనా నుంచి రక్షణ కోసం మార్కెట్‌లోకి..!

కరోనా మహమ్మారి మనుషులపై ఏ రకంగా దాడి చేసిందో అందరం చూశాం. ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్న రోజులకి ఈ మహమ్మారి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు.

గంటలోనే 99.99 శాతం బాక్టీరియాను చంపే మాస్క్, కరోనా నుంచి రక్షణ కోసం మార్కెట్‌లోకి..!
Ram Naramaneni
|

Updated on: Nov 15, 2020 | 2:09 PM

Share

కరోనా మహమ్మారి మనుషులపై ఏ రకంగా దాడి చేసిందో అందరం చూశాం. ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్న రోజులకి ఈ మహమ్మారి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ డేంజరస్ వైరస్‌కు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ రాలేదు. ఈ క్రమంలో నిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. అందులో ముఖ్యమైనది మాస్క్. అవును కరోనా వైరస్‌పై పోరాడటానికి  మనిషికి మాస్క్ ఇప్పుడు బ్రహ్మాస్త్రం. ఎదుటి వ్యక్తి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాాలంటే మాస్క్ వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల మాస్కులు లభ్యమవుతున్నాయి. అయితే ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన కొత్త మాస్కు కరోనాని సమర్థవంతంగా నిరోధిస్తోందట. సైంటిష్టులు తయారుచేసిన ఈ మాస్క్ ఒక గంట పాటు ఎండలో వినియోగిస్తే 99.99 శాతం బాక్టీరియాను చంపేస్తుందని చెబుతున్నారు.

మళ్లీ..మళ్లీ వినియోగించేందుకు వీలుగా వీరు ఈ కాటన్ మాస్క్‌ను తయారు చేశారు. రీసెర్చ్ టీమ్ తెలిపిన ప్రకారం ఈ మాస్కు 10 సార్లు ఉతికి ఎండలో ఉంచినప్పటికీ దాని సహజ స్వభావాన్ని కోల్పోదని వివరిస్తున్నారు.  వివిధ వస్త్ర పదార్థాలతో తయారు చేసిన ఈ ఫేస్ మాస్క్‌లు నానోస్కేల్ ఏరోసోల్ కణాలను ఫిల్టర్ చేయగలవని చెప్పారు.  దగ్గు లేదా తుమ్ము ద్వారా విడుదల చేయబడిన బ్యాక్టీరియాలు, ప్రాణాంతకమైన కోవిడ్ -19 తో సహా వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. 

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చెందిన రీసెర్చ్ టీమ్, డేవిస్‌ ఈ మాస్క్‌ను తయారు చేశారని, మాస్క్‌ని సూర్యరశ్మిలో ఉంచినప్పుడు మాస్క్‌లోని కాటన్‌ మేటిరియల్‌ రియాక్టివ్‌ ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తుందని…అది ఇందులోని సూక్ష్మకణాలను చంపుతుందన్నారు. మాస్క్‌లో 2-డైఇతైల్‌ అమైనో క్లోరైడ్‌ వాడారని పేర్కొన్నారు. ఇది వైరస్‌ని సమర్థవంతంగా ఎదుర్కుంటుందని చెప్పారు. ఈ మాస్క్‌ను వినియోగించేవారు అందులోని సూక్ష్మ కణాలను చంపే గుణం పోకుండా ఉండటం కోసం రోజు పది సార్లు నీటిలో తడిపి, ఎండకు ఉంచాలని… అలా  7 రోజుల పాటు చెయ్యాలని సూచించారు.

Also Read :

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !