అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త షరతు విధించింది. ఈ షరతు తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోను, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ షరతు అమలయ్యేలా చూడాలని వివిధ శాఖల జాయింట్ సెక్రెటరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:01 PM

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త షరతు విధించింది. ఈ షరతు తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోను, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ షరతు అమలయ్యేలా చూడాలని వివిధ శాఖల జాయింట్ సెక్రెటరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఆరోగ్య సేతు యాప్‌ని ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బుధవారం మరి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అవుట్సోర్సింగ్ స్టాఫ్.. తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ని తక్షణం తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిరోజు ఆఫీసుకు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌లో తమ స్టేటస్ చెక్ చేసుకోవాలని.. యాప్‌లో ‘‘సేఫ్’’ లేదా ‘‘ లో రిస్క్’’ అని చూపెడితేనే కార్యాలయానికి రావాలని తాజా ఆదేశాలలో పేర్కొన్నారు.

ఒకవేళ బ్లూటూత్ సామీప్యత ఆధారంగా ఆరోగ్య సేతు యాప్‌లో ‘‘మోడరేట్’’ లేదా ‘‘హైరిస్క్’’ అని స్టేటస్ చూపిస్తే ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాంటి వారు 14 రోజులు హోం క్వారెంటైన్‌లో వుండాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్‌లో ‘‘లో రిస్క్’’ అని కానీ ‘‘సేఫ్’’ అని కానీ చూపించే వరకు ఇంటి దగ్గరే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి

Latest Articles