సంక్షోభంలో బీఎస్ఎన్ఎల్…?
ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతోంది. గతకొన్నేళ్లుగా నష్టాల బాటలోనే నడుస్తున్న బీఎస్ఎన్ఎల్ 2016లో జియో ఎంట్రీ తర్వాత మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ఆఫర్లు ప్రకటించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నష్టాలు భరిస్తూనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఇక తన వల్ల కాదని చేతులెత్తేసింది. మరోవైపు జీతాల చెల్లింపు జాప్యాన్ని నిరశిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో బీఎస్ఎన్ఎల్ […]

ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతోంది. గతకొన్నేళ్లుగా నష్టాల బాటలోనే నడుస్తున్న బీఎస్ఎన్ఎల్ 2016లో జియో ఎంట్రీ తర్వాత మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ఆఫర్లు ప్రకటించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నష్టాలు భరిస్తూనే ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఇక తన వల్ల కాదని చేతులెత్తేసింది.
మరోవైపు జీతాల చెల్లింపు జాప్యాన్ని నిరశిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ గొంతు మూగబోయే స్థితి కనిపిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కొన్నేండ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల వేతనాలను మాత్రం ప్రతి నెలా ఒకటో తేదీన ఖాతాల్లో జమ చేసేది. కాగా తాజా పరిస్థితి మాత్రం ఎన్నడూ తలెత్తలేదు. సిబ్బందికి చెల్లించాల్సిన ఫిబ్రవరి నెల వేతనాలు ఇంతవరకూ చెల్లించకపోవడం దురదృ ష్టకరం.
అయితే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తోంది. సంస్థను దీర్ఘకాలంగా నడిపించేందుకు… ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలని సంస్థ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేక బీఎస్ఎన్ఎల్ ఇబ్బంది పడుతోంది. దీంతో రూ.850 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. టెలికం రంగం మొత్తంగా రూ.6.1 లక్షల కోట్ల అప్పుల్లో ఉండగా ఒక్క బీఎస్ఎన్‌ఎల్‌కే రూ.13,500 కోట్ల అప్పులున్నాయి.



