AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత సజీవ దహనం

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నేత సజీవ దహనం అయ్యారు.

మహారాష్ట్రలో దారుణం.. ఎన్సీపీ నేత సజీవ దహనం
Balaraju Goud
|

Updated on: Oct 15, 2020 | 8:52 AM

Share

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నేత సజీవ దహనం అయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ముంబై-ఆగ్రా హైవేపై ఆయన ప్రయాణిస్తుండగా పింపల్‌గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన జరిగింది. కారులోని వైరింగ్ షార్ట్‌సర్క్యూట్ అయిది. దీంతో వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. కారులో శానిటైజర్లు కూడా ఉండటంతో మంటలు మరింత వేగంగా అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కారులో మంటలు రావడంతో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ యాక్టివేట్ అయి డోర్స్ జామ్ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే సంజయ్ షిండే కారు నుంచి బయటకు రాలేక సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే సంజయ్ షిండే ప్రాణాలు కోల్పోయారు. కాగా.. సంజయ్ షిండే ప్రసిద్ద ద్రాక్ష ఎగుమతిదారునిగా మంచి పేరుగడించారు. ఎన్సీపీనేతగా రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. నాసిక్ జిల్లాలో ఆయనకు వైన్ తయారీ కేంద్రం ఉంది. తన పండ్ల తోట కోసం పురుగు మందులను కొనేందుకు ఆయన పింపాల్‌గావ్ వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us