AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఉన్నారేంట్రా సామీ.. ఎక్కడా లేన్నట్టుగా రన్నింగ్‌ ట్రైన్‌ ముందొచ్చి పడ్డాడు! ఆ తర్వాత జరిగింది చూడాలంటే..

మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు పట్టాలు దాటుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ప్యాసింజర్ రైలు లోకో పైలట్ సకాలంలో అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. అయినప్పటికీ ఇంజన్ ఆ యువకుడి పైకి వెళ్లింది. ఈ హృదయ విదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇలా ఉన్నారేంట్రా సామీ.. ఎక్కడా లేన్నట్టుగా రన్నింగ్‌ ట్రైన్‌ ముందొచ్చి పడ్డాడు! ఆ తర్వాత జరిగింది చూడాలంటే..
Loco Pilot Saves Man
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2026 | 7:29 PM

Share

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లాలో ఒళ్లు జలదరించే సంఘటన చోటు చేసుకుంది. చూసిన వారికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. రైలు పట్టాలపై మద్యం మత్తులో తూలుతూ పడిపోయిన ఓ యువకుడిని, లోకో పైలట్ తన సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ హృదయ విదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకో పైలట్ చాకచక్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలేం జరిగిందంటే…

హర్దోయీ జిల్లా పరిధిలోని సీతాపూర్-బలమౌ రైలు మార్గంలో ఒక యువకుడు తీవ్రమైన మద్యం మత్తులో పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పి పట్టాలపై పడిపోయి లేవలేని స్థితిలోకి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో బలమౌ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వేగంగా వస్తోంది.

పట్టాలపై పడి ఉన్న యువకుడిని గమనించిన లోకో పైలట్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయితే వేగం కారణంగా రైలు ఇంజన్ ఆ యువకుడి పైకి వెళ్లాక ఆగింది. ప్రమాదం జరిగిపోయిందని అందరూ భయాందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కిందకు దిగి పరిశీలించగా, ఆ యువకుడు రైలు ఇంజన్ కింద పట్టాల మధ్యన పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో ఆ యువకుడిని సురక్షితంగా బయటకు లాగారు. ఆశ్చర్యకరంగా, అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ యువకుడికి చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ రెస్క్యూకి సంబంధించిన వీడియోను అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. సకాలంలో స్పందించి ఒక అమాయక ప్రాణాన్ని కాపాడిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌పై నెటిజన్లు, రైల్వే అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మద్యం మత్తులో పట్టాల పైకి రావడం అత్యంత ప్రమాదకరమని, ఇటువంటి నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు తెస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు