AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

కేవలం 12 గంటలు.. ఏకంగా 10 లక్షలకు పైగా ఫాలోవర్లు.. సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సృష్టిస్తున్న సునామీకి ఇది మరో నిదర్శనం. గురువారం అర్ధరాత్రి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై మోదీ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఆయన ఫాలోవర్లను అమాంతంగా పెంచేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
1 Million Instagram Followers In 12 Hours
Krishna S
|

Updated on: Jul 24, 2026 | 7:54 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి హైలెట్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య నిమిషాల వ్యవధిలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.1 మిలియన్ల ఫాలోవర్లు మోదీ ఖాతాకు పెరగడం డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయాలు కావని, అవి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన అంశాలని అందులో మోదీ తెలిపారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

12 గంటల్లోనే

ఈ వీడియో అప్‌లోడ్ చేయకముందు ప్రధాని మోదీ ఫాలోవర్స్ 101 మిలియన్స్ ఉన్నారు. ఈ వీడియో అప్‌లోడ్ తర్వాత ఆ సంఖ్య 102 మిలియన్స్‌కు చేరడం గమనార్హం. ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ క్రేజ్, దేశీయంగా ఆయనకున్న ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో ఈ ఫాలోవర్ల పెరుగుదల స్పష్టం చేస్తోంది. గడిచిన కొద్ది గంటల్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫాలోవర్లు పెరగడంపై పలువురు డిజిటల్ విశ్లేషకులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.

ప్రపంచంలోనే మోస్ట్ ఫాలోడ్ లీడర్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలో అవుతున్న అధికారంలో ఉన్న ఏకైక ప్రపంచ నేతగా రికార్డు సృష్టించారు. మోదీ ఇప్పటికే 100 మిలియన్లకు పైగా ఫాలోవర్ల అరుదైన మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా మాజీ లేదా ప్రస్తుత అధ్యక్షులు, యూకే ప్రధానులు, ఇతర గ్లోబల్ లీడర్ల కంటే ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే