OTT Movie: ఓటీటీలోకి విజయ్ ఆంటోని ఫీల్ గుడ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు.. అధికారిక ప్రకటన
విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన రీసెంట్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్ళు' ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని ZEE5 తెలుగు ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇటీవల విడుదలైన ‘పరిమళ & కో’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విజయం ప్రేక్షకులకు వాస్తవికమైన, సులభంగా అర్థమయ్యే, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లను అందించాలనే ZEE5 తెలుగు నిబద్ధతను మరింత చాటింది. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు ‘వంద దేవుళ్ళు’తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ మూవీలోని భావోద్వేగాలు పూర్తిగా భిన్నమైనవి. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ‘వంద దేవుళ్ళు’ చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. నలభై దాటడం, మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది.
తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు. ‘వంద దేవుళ్ళు’ ఒక ఒంటరి తల్లి కథను చెబుతున్నప్పటికీ దానిలోని భావోద్వేగాలు కేవలం ఒక మహిళ ప్రయాణానికే పరిమితం కావు. ఈ చిత్రం వివాహం, మాతృత్వం, త్యాగం, సహచర్యం, మహిళలపై అణచివేతను చూపిస్తుంది. అన్ని తరాల తల్లులు, వివాహిత మహిళలు తమకు తాము అన్వయించుకోగలిగే కథగా నిలుస్తుంది.
ఈ చిత్రం థియేటర్లలో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇందులోని సహజమైన భావోద్వేగాలు, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి ప్రేక్షకులు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, చర్చలను రేకెత్తించి, మారుతున్న సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథల కోసం ఎదురుచూస్తున్నారని మేము నమ్ముతున్నాము. ‘వంద దేవుళ్ళు’ సరిగ్గా అదే చేస్తుంది. ఈ మూవీ మన మూలాల్లోని కథనాన్ని, ప్రగతిశీల, ఆలోచింపజేసే ఇతివృత్తంతో మేళవించి, భావోద్వేగభరితంగా అందరికీ చేరువయ్యేలా చేస్తుంది.
ఈ సందర్భంగా మార్కెటింగ్ సౌత్, తమిళ & మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి జేవియర్ మాట్లాడుతూ.. ‘’పరిమళ & కో.’ చిత్రానికి లభించిన అఖండ స్పందన వాస్తవికమైన, అందరికీ చేరువయ్యే కథల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని మరోసారి ధృవీకరించింది. ‘వంద దేవుళ్లు’తో మేము ఆ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అధ్యాయాన్ని జోడిస్తున్నాము. మేము మా వైవిధ్యభరితమైన కంటెంట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ అన్ని భాషలలో కుటుంబ వినోదానికి అంతిమ గమ్యస్థానంగా ZEE5 స్థానాన్ని బలోపేతం చేస్తున్నాం. ఈ క్రమంలో ఈ హృద్యమైన కథను తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ ప్రేక్షకులకు అందించడానికి ఉత్సాహంగా ఉన్నాము” అని అన్నారు.
‘పరిమళ & కో.’మూవీలోని నవ్వులు, వినోదం తర్వాత ఇప్పుడు హృదయాన్ని హత్తుకునే కథకు సమయం వచ్చింది. ‘వంద దేవుళ్లు’ ఈ ఆగస్టులో ప్రత్యేకంగా ZEE5లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది..
వంద దేవుళ్లు సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




