పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. NTSE పరీక్ష షెడ్యూల్ ఇదే..

పదో తరగతి విద్యార్థుల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) నిర్వహించే టాలెంట్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది.

పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. NTSE పరీక్ష షెడ్యూల్ ఇదే..
Ravi Kiran

|

Oct 28, 2020 | 5:53 PM

NTSE Exam Dates: పదో తరగతి విద్యార్థుల కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) నిర్వహించే టాలెంట్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. NTSE తొలిదశ పరీక్షలు డిసెంబర్ 12-13వ తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో దశ పరీక్షలు 2021, జూన్ 13న జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 2 వేల మంది విద్యార్థులుకు.. ఇంటర్‌కు వెళ్లాక నెలకు రూ. 1250, అలాగే డిగ్రీ, పీజీల్లో రూ.2000 స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.

NTSE పరీక్షకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు కాగా.. వారు తొమ్మిదో తరగతిలో 60 శాతం మార్కులు ఖచ్చితంగా సాధించాలి. అంతేకాదు విద్యార్థులు తప్పనిసరిగా ఆయా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని గుర్తింపు పొందిన పాఠశాలలలో చదువుతుండాలి. కాగా, తొలిదశ పరీక్షల అడ్మిట్ కార్డు నవంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. దాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ ciet.nic.in ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అండమాన్ నికోబర్ ఐలాండ్స్‌లో తొలిదశ ఎగ్జామ్ డిసెంబర్ 12న జరగనుండగా.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 13న నిర్వహిస్తారు. ఈ టాలెంట్ పరీక్ష గురించి పూర్తి వివరాల కోసం ncert.nic.in ను సంప్రదించవచ్చు.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu