తెలుగు విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సులకు ఆహ్వానం
తెలుగు విశ్వవిద్యాలయం కూడా అన్ని కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2020 - 2021 విద్యా సంవత్సరానికి దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
Notice For Distance Education : అన్ని ప్రవేశ పరీక్షలు మొదలయ్యాయి. తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా అన్ని కోర్సుల్లో ఎంట్రెన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2020 – 2021 విద్యా సంవత్సరానికి దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ఈ వివరాలను విశ్వ విద్యాలయ ఇన్‌చార్జి ఉపాధ్యక్షులు నీతూ కుమారి ప్రసాద్ వర్సిటీ సమావేశ మందిరంలో ఆన్‌లైన్ ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు. పీజీ డిప్లొమా కోర్సులుగా ఏడాది కాల వ్యవధితో టీవీ జర్నలిజం, జ్యోతిర్వాస్తులను, రెండేళ్ల వ్యవధితో లలిత సంగీతం, ఏడాది కాలంతో ఫిల్మ్ రైటింగ్, జ్యోతిషంలను, సర్టిఫికెట్ కోర్సులుగా సంగీత విశారద, ఆధునిక తెలుగు, జ్యోతిషంలను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ తెలిపారు. అన్ని వివరాలు వర్శిటీ www.telugu university. ac.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు.
దరఖాస్తులను నవంబర్ 31లోపు సమర్పించాలని, ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు దూర విద్యా కేంద్రం సంచాలకుడు ప్రొఫెసర్ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు.