AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి అబాసుపాలైన పాక్.. లేని అధికారిని వెనక్కి పిలవాలంటూ తీర్మానం

పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అబాసుపాలైంది. లేని అధికారిని వెనక్కి రప్పించేందుకు ఆ దేశ జాతీయ అసంబ్లీ తీర్మానం చేసింది.

మరోసారి అబాసుపాలైన పాక్.. లేని అధికారిని వెనక్కి పిలవాలంటూ తీర్మానం
Balaraju Goud
|

Updated on: Oct 28, 2020 | 5:52 PM

Share

పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అబాసుపాలైంది. లేని అధికారిని వెనక్కి రప్పించేందుకు ఆ దేశ జాతీయ అసంబ్లీ తీర్మానం చేసింది. ఇస్లాఇస్లాం గురించి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ వింత తీర్మానం చేసింది. ఇస్లాంపై వ్యాఖ్యలు చేసినందుకు ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నుంచి పాక్ రాయబారిని తిరిగి స్వదేశానికి రప్పించాలని పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. అయితే, కొసమెరుపు ఏమంటే, అసలు పాకిస్తాన్ దేశానికి ఫ్రాన్స్ దేశంలో రాయబారి లేకపోవడం విశేషం.

పారిస్ లో పాకిస్తాన్ చివరి రాయబారిగా పనిచేసిన మెయిన్ ఉల్ హక్ మూడు నెలల క్రితమే చైనాకు బదిలీ కావడంతో అతను ఫ్రాన్స్ వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ఫ్రాన్స్ దేశానికి హక్ స్థానంలో మరో రాయబారిని పాక్ నియమించలేదు. అయితే, తాజాగా పాక్ జాతీయ అసెంబ్లీలో లేని అధికారిని వెనక్కు పిలవాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ. పారిస్ లో పాక్ దేశ రాయబారి లేరనే విషయం తెలుసు. అయినప్పటికీ లేని రాయబారిని పాక్ తిరిగి రావాలని కోరుతూ సాక్షాత్తూ పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానించడంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ అబాసుపాలైంది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్‌లోని ఫ్రెంచ్ రాయబారిని పాకిస్తాన్ సోమవారం పిలిచి… మహమ్మద్ ప్రవక్త యొక్క కార్టూన్‌ల ప్రచురణను సమర్థించడం ద్వారా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై దాడి చేశారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

Follow Us
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
జైలర్ 2‏లో ఇరగదీసిన సూపర్ స్టార్.. 75 ఏళ్ల వయసులో అదే ఎనర్జీ..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
విజయదశమి ఆయుధ పూజ: ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజించే విధానం..
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
ఆ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
వైద్యం కోసం అప్పులు.. ఒక్క అనారోగ్యంతో పేదరికంలోకి!
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ 2027 విడుదల..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
ముంబైలో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
షాలిని కోసం ఆ కంటెస్టెంట్ బలి.. ఒక్కరోజులో మారిన లెక్కలు..
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు
ప్రభుత్వ జాబ్ కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు