బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్‌డీఏనే!

బీహార్‌లో ఎన్‌డీఎ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి జితిన్‌రామ్‌ మాంఝీ. మొదటి దశ ఎన్నికల్లో 50 స్థానాలు ఎన్‌డీయే కూటమే గెల్చుకుంటుందన్నారు.. హిందుస్తానీ ఆవావ్‌ మోర్చ అధినేత అయిన మాంఝీ ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే! తొలి విడతలో ఎన్నికలు జరిగిన 71 స్థానాలలో ఎన్‌డీఏ కూటమికే 50 సీట్లు వస్తాయన్నారు మాంఝీ. బీహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసిన జనం మరోసారి తమకే ఓటు వేస్తారన్న […]

బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్‌డీఏనే!
Follow us

|

Updated on: Oct 28, 2020 | 5:39 PM

బీహార్‌లో ఎన్‌డీఎ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి జితిన్‌రామ్‌ మాంఝీ. మొదటి దశ ఎన్నికల్లో 50 స్థానాలు ఎన్‌డీయే కూటమే గెల్చుకుంటుందన్నారు.. హిందుస్తానీ ఆవావ్‌ మోర్చ అధినేత అయిన మాంఝీ ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే! తొలి విడతలో ఎన్నికలు జరిగిన 71 స్థానాలలో ఎన్‌డీఏ కూటమికే 50 సీట్లు వస్తాయన్నారు మాంఝీ. బీహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసిన జనం మరోసారి తమకే ఓటు వేస్తారన్న ధీమా కనబర్చారు. గయలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు జితిన్‌రామ్ మాంఝీ..