Ayurvedic Tips for Eye: 15 రోజుల పాటు క్రమంతప్పకుండా రోజుకొక్కటి తింటే చాలు.. మీ కళ్ళ సమస్యలన్నీ పరార్!
ఈ రోజుల్లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కళ్లకు పెద్ద శత్రువుగా మారాయి. పుట్టిన కొద్ది నెలల నుంచే పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. మరోవైపు కోవిడ్ అనంతర కాలం నుంచి పెద్దలు కూడా మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అన్ని సమయాలలో సోషల్ మీడియా, వీడియోలు చూస్తూ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లకు చాలా హానికరం. ఇది కంటి చూపును బలహీనపరుస్తుంది..

ఈ రోజుల్లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కళ్లకు పెద్ద శత్రువుగా మారాయి. పుట్టిన కొద్ది నెలల నుంచే పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. మరోవైపు కోవిడ్ అనంతర కాలం నుంచి పెద్దలు కూడా మొబైల్ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అన్ని సమయాలలో సోషల్ మీడియా, వీడియోలు చూస్తూ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లకు చాలా హానికరం. ఇది కంటి చూపును బలహీనపరుస్తుంది. రెటీనాపై ఒత్తిడితో పాటు చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి పరిస్థితికి దారితీస్తుంది. కంటి సమస్యలున్న చాలా మందికి లేజర్ సర్జరీ కూడా చేయించుకుంటున్నారు. కాబట్టి, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది నియమాలు తప్పక పాటించాలి. అప్పుడు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటమేకాకుండా చూపు కూడా మెరుగుపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కళ్ల ఆరోగ్యాన్ని పెంచేందుకు కేవలం 15 రోజుల పాటు ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం..
ఈ ప్రత్యేకమైన లడ్డూ తయారీకి కావల్సిన పదార్ధాలు..
200 గ్రాముల వెన్న, 100 గ్రాముల బాదం, 50 గ్రాముల కొబ్బరి, 20 గ్రాముల ఫెన్నెల్, 20 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల అవిసె గింజలు, 10 గ్రాముల మిరియాలు, 400 గ్రాముల బెల్లం, 100 గ్రాముల దేశీ నెయ్యి తీసుకోవాలి.
తయారీ విధానం..
పాన్‌లో ఒక చెంచా నెయ్యి వేసి వేడి చేయాలి. దీనాలో బాదంపప్పు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో మరో చెంచా నెయ్యి వేసి అందులో సోపు, నువ్వులు, తురిమిన కొబ్బరి, అవిసె గింజలు వేసి వేయించాలి. మధ్యలో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి కలపాలి. ప్రతిదీ 20 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చి మిక్సర్‌లో పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్‌పై మరో పాన్ వేసి వేడి అందులో మిగిలిన నెయ్యితో వేసి వేడిచేయాలి. తర్వాత పొడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చి కొద్దిగా నెయ్యి చేతులకు రాసుకుని గుడ్డంగా లడ్డూలు చుట్టాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో ఒక లడ్డూ తినాలి. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది.
3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రతిరోజూ ఈ లడ్డూలు ఒకటి చొప్పున తినిపించాలి. 15 రోజులు నిరంతరం వీటిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది రెటీనాను అన్ని వైపుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఈ లడ్డూలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.




