స్విమ్మర్‌ ఆశుతోష్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

జాతీయ స్థాయి స్విమ్మర్‌ ఆశుతోష్‌ కరోనా చికిత్సతో ఇటీవల ఢిల్లీలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆశుతోష్ చనిపోయాడంటూ ఫ్యామిలీ మెంబర్స్ మండిపడుతున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:42 pm, Tue, 23 June 20
స్విమ్మర్‌ ఆశుతోష్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే ప్రాణాలు తీశారంటూ ఆరోపిస్తున్నారు జాతీయ క్రీడాకారుడి కుటుంబసభ్యలు.
జాతీయ స్థాయి స్విమ్మర్‌ ఆశుతోష్‌ కరోనా చికిత్సతో ఇటీవల ఢిల్లీలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆశుతోష్ చనిపోయాడంటూ ఫ్యామిలీ మెంబర్స్ మండిపడుతున్నారు.

జూన్‌ 10న అనారోగ్యానికి గురైన ఆశుతోష్ ను కుటుంబసభ్యులు లేడీ హార్డింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అనంతరం ఇంట్లో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందంటూ సలహా ఇచ్చారు. కొద్దిరోజులు బాగానే ఉన్న పరిస్థితి విషమించడంతో వెంటనే లేడీ హార్డింగ్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా జూన్‌ 17న ఆశుతోష్ తుదిశ్వాస విడిచారు. అయితే, అతని మృతికి ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడి వైద్యులు అతనికి చికిత్స అందించేందుకు అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరికి మృతదేహం అప్పగింతలోనూ సిబ్బంది తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వక్తం చేశారు. అతని మరణంతో తమ కుటుంబం జీవనోపాధి కోల్పోయిందని ఆవేదన వక్తం చేశారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.