నాని ‘వి’ ట్రైలర్.. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయింది.. బొమ్మ హిట్టే.!

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

  • Ravi Kiran
  • Publish Date - 11:40 am, Wed, 26 August 20
నాని 'వి' ట్రైలర్.. ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయింది.. బొమ్మ హిట్టే.!

Nani V The Movie: నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. నివేధా థామస్, అదితీ రావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించారు. నానికి ఇది 25వ సినిమా కాగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో ఇది మూడో సినిమా. ఇప్పటికే టీజర్‌, రెండు పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ట్రైలర్ ఆధ్యంతం సస్పెన్స్ సన్నివేశాలతో ఆకట్టుకోగా.. నాని, సుధీర్ బాబు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో నాని మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం అందించారు.