AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమికి దగ్గరగా దూసుకువస్తున్న మరో గ్రహాశకలం..!

అదిగో యుగాంతం... ఇదిగో మహా ప్రళయం.. మరికొన్ని రోజుల్లో అండ పిండ బ్రహ్మాండమంతా మటాష్‌ అంటూ చెప్పిందే చెప్పుకొస్తున్నారని అని విసుక్కోకపోతే తాజాగా నాసా ఏం చెప్పిందో ఓసారి తెలుసుకుందాం! ఓ ఆస్టరాయిడ్‌ భూమ్మీదకు రయ్యిమంటూ వస్తున్నదట!

భూమికి దగ్గరగా దూసుకువస్తున్న మరో గ్రహాశకలం..!
Balu
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 12:09 PM

Share

అదిగో యుగాంతం… ఇదిగో మహా ప్రళయం.. మరికొన్ని రోజుల్లో అండ పిండ బ్రహ్మాండమంతా మటాష్‌ అంటూ చెప్పిందే చెప్పుకొస్తున్నారని అని విసుక్కోకపోతే తాజాగా నాసా ఏం చెప్పిందో ఓసారి తెలుసుకుందాం! ఓ ఆస్టరాయిడ్‌ భూమ్మీదకు రయ్యిమంటూ వస్తున్నదట! రెండేళ్ల కిందటే ఈ గ్రహశకలాన్ని నాసా గుర్తించిందట! అన్నట్టు దీనికి 2018VP1 అన్న పేరు కూడా ఉంది.. వచ్చే నవంబర్‌లో భూమిని తాకబోతున్నదట! ఈ ‘ట’లు ఎందుకంటే నాసాకే క్లారిటీ లేదు.. నవంబర్‌ రెండున భూమికి అత్యంత దగ్గరగా.. అంటే 482 కిలోమీటర్ల దూరం నుంచి వెళుతుందని చెబుతోంది నాసా. అలా భూమి నుంచి అల్లంత దూరం నుంచి వెళితే మట్టుకు ఏ ప్రమాదమూ లేదు.. సపోజ్‌ పర్‌ సపోజ్‌ భూమిని తాకితే మట్టుకు ప్రళయమేనని అంటోంది నాసా. భూమిని ఢీకొట్టే ఛాన్స్‌ పాయింట్‌ 41 శాతమేనని కూడా చెప్పింది.. ఇలాగే కొన్ని రోజుల కిందట కూడా ఓ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చేసి తన మానాన తను వెళ్లిపోయింది.. ఇప్పుడూ అదే జరగవచ్చు…