వైట్ హౌస్ లో ‘అద్భుతం’, అమెరికన్ గా ప్రమాణం చేసిన ఇండియన్ టెకీ సుధా నారాయణన్

అమెరికా శ్వేతసౌధం 'వైట్ హౌస్' లో ఎన్నడూ జరగని అద్భుతం చోటుచేసుకుంది. అమెరికా పౌరసత్వం తీసుకుని ఆ దేశస్థురాలిగా ప్రమాణం చేశారు ఇండియన్ టెకీ ఒకరు. ఈ 'నేచురలైజేషన్ కార్యక్రమం'లో పాల్గొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

  • Umakanth Rao
  • Publish Date - 1:15 pm, Wed, 26 August 20
వైట్ హౌస్ లో 'అద్భుతం', అమెరికన్ గా ప్రమాణం చేసిన ఇండియన్ టెకీ సుధా నారాయణన్

అమెరికా శ్వేతసౌధం ‘వైట్ హౌస్’ లో ఎన్నడూ జరగని అద్భుతం చోటుచేసుకుంది. అమెరికా పౌరసత్వం తీసుకుని ఆ దేశస్థురాలిగా ప్రమాణం చేశారు ఇండియన్ టెకీ ఒకరు. ఈ ‘నేచురలైజేషన్ కార్యక్రమం’లో పాల్గొన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ’ అసమాన, అద్భుత దేశంలో భాగమైనందుకు ఆమెను అభినందించారు. ఇండియాతో బాటు లెబనాన్, సూడాన్ , ఘనా, బొలీవియా దేశాల ఇమ్మిగ్రెంట్లు ఈ సెరిమనీలో తాము కూడా అమెరికన్లుగా మారారు. ఈ అయిదుగురు సభ్యులనూ తాము ఆనందంగా ఆహ్వానిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. వీరు అమెరికా చట్టాలను గౌరవిస్తారని, ఈ దేశ చరిత్ర, విలువలను పూర్తిగా గ్రహించారని ఆయన అన్నారు. అమెరికా పౌరసత్వానికి మించిన గౌరవం లేదన్నారు,

13 ఏళ్ళ క్రితం ఇండియా నుంచి సుధా సుందరి నారాయణన్ అమెరికా వచ్చారని,  అద్భుత ప్రతిభ గల ఆమెను, ఆమె భర్తను అభినందిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు., వీరి ఇద్దరు పిల్లలను ఆయన ‘బ్యూటిఫుల్ యాపిల్స్ ఆఫ్ ధైర్ లైఫ్ ‘ గా అభివర్ణించారు. బ్రైట్ కొరల్ కలర్ పింక్ చీరను ధరించిన సుధా నారాయణన్ కు ఆయన అమెరికా పౌరసత్వ సర్టిఫికెట్ అందజేశారు.