“నమో టీవీ”కి ఈసీ భారీ షాక్

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన నమో టీవీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి నమో టీవీలో రాజకీయ అంశానికి చెందిన ప్రసారాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్‌ చేయకుండా ఈ చానల్‌లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్‌ […]

నమో టీవీకి ఈసీ భారీ షాక్
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 3:12 PM

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన నమో టీవీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి నమో టీవీలో రాజకీయ అంశానికి చెందిన ప్రసారాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్‌ చేయకుండా ఈ చానల్‌లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ ఆమోదం పొందినవాటినే ప్రసారం చేసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.

నమో టీవీ ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సీఈవోను ఈసీ ఆదేశించింది. నమో టీవీ సర్టిఫికేషన్‌ లేకుండానే పలు వీడియోలను ప్రసారం చేసినట్లు సీఈవో గుర్తించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నమోటీవీని తెరపైకి తెచ్చింది. న‌మో యాప్‌లో భాగంగానే న‌మో టీవీని న‌డుపుతున్న‌ట్లు బీజేపీ వెల్లడించింది. మార్చి 31 నుంచి అక‌స్మాత్తుగా శాటిలైట్ టీవీ నెట్‌వ‌ర్క్స్  న‌మోటీవీని ప్ర‌సారం చేస్తున్నాయి. దీన్ని విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని.. ఎన్నికల కోడ్‌ ఉన్నా ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని విపక్షాలు మండిపడుతున్నాయి.