road accident in australia: ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో పాలమూరు బిడ్డ మృతి.. బైక్‌పై వెళ్తుండగా దుర్ఘటన

ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తెలంగాణకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి.

road accident in australia: ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో పాలమూరు బిడ్డ మృతి.. బైక్‌పై వెళ్తుండగా దుర్ఘటన
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 02, 2021 | 11:44 AM

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి దుర్మరణం పాలైంది. గురువారం ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) ఎంఎస్‌ చదివేందుకు ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతోంది. గురువారం బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదన్న వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, రక్షిత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనిత దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. వంగూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడింది. కూతురు రక్షిత ఉన్నత చదువుల కోసం అస్ట్రేలియాకు వెళ్లింది. తండ్రి వెంకట్‌ రెడ్డి ఆర్మీలో పనిచేసి స్వచ్ఛందంగా రిటైరై ప్రస్తుతం డీఆర్‌డీఏలో ఉద్యోగం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ప్రస్తుతం నివాసముంటున్నారు.