Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story First Day Collections: చైతు, సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’కి యుఎస్ ప్రేక్షకులు ఫిదా.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే

Love Story First Day US Collections: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో సినీ పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.  సినిమా షూటింగ్స్ లో జాప్యం.. కరోనా నేపథ్యంలో సినిమా రిలీజ్ చేసినా .. థియేటర్స్ కు..

Love Story First Day Collections: చైతు, సాయిపల్లవిల 'లవ్ స్టోరీ'కి యుఎస్ ప్రేక్షకులు ఫిదా.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే
Love Story
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2021 | 4:19 PM

Love Story  First Day US Collections: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో సినీ పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.  సినిమా షూటింగ్స్ లో జాప్యం.. కరోనా నేపథ్యంలో సినిమా రిలీజ్ చేసినా .. థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారో రారో అనే ఆలోచనలు .. ఇవన్నీ కలిసి..  చిన్న, పెద్ద సినిమాలకు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ థియేటర్స్ వైపు కంటే.. ఒటిటి ల వైపే చూస్తున్న వేళ.. లవ స్టోరీ సినిమా వెండి తెరపై సందడి చేయడానికి వచ్చింది.

అవును కరోనా సెకండ్ వేవ్ త‌ర్వాత సినిమా థియేట‌ర్స్‌కు రావ‌డానికి ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్న సమయంలో చిన్న, పెద్ద  సినిమాలు మాత్రమే చాలా రిలీజ్ అయ్యాయి. అయితే ఆశించిన  స్థాయిలో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడంలో అవి విఫలమయ్యాయి. అయితే ఇటీవల రిలీజైన సిటీమార్ సినిమా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ మంచి బజ్ ను క్రియేట్ చేస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా లవ్ స్టోరీ కచ్చితంగా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ వైపు అడుగులేయించ‌డంలోనూ స‌క్సెస్ అయ్యింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటి వరకూ ఏ సినిమాకు రాని విధంగా ప్రేక్షకులను థియేటర్స్ వద్దకు రప్పించింది. లవ్ స్టోరీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో   శుక్ర‌వారం(సెప్టెంబ‌ర్ 24) థియేట‌ర్స్  లో రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ల‌వ్‌స్టోరి సినిమా చూడ‌టానికి ప్రేక్షకులు థియేటర్స్ వద్దకు క్యూ కట్టారు. ఒక్క  తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవ‌ర్‌సీస్‌లోనూ కూడా ‘లవ్ స్టోరీ’కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

అమెరికాలో లవ్ స్టోరీ ప్రీమియర్ షోల‌కు కూడా ప్రేక్ష‌కులు అమెరికాలో క్యూ క‌ట్ట‌డం విశేషం. అమెరికాలో 224 లొకేష‌న్స్‌లో ల‌వ్‌స్టోరి ప్రీమియ‌ర్స్ వేస్తే, 3,07,103 డాల‌ర్స్  వసూలు చేసింది.  ఇక ఫస్ట్ డే 144 లొకేష‌న్స్‌ల్లో 85,232 డాల‌ర్స్  కలెక్షన్ల రాబట్టింది. మొత్తం యుఎస్ లో లవ్ స్టోర్ మొదటి రోజు కలెక్షన్లు 3,92, 335 డాల‌ర్స్ ను వసూలు చేసింది. మన దేశ కరెన్సీలో లవ్ స్టోరీ యుఎస్ లో మొదటి రోజు రూ.2.9 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపినింగ్ కలెక్షన్ల రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాదు.. నెక్స్ట్ రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాలకు లవ్ స్టోరీ కలెక్షన్లు ఊపిరినిచ్చిందని చెప్పవచ్చు.  నాగ చైతన్య , సాయి పల్లవులు ఈ సినిమాలో పోటాపోటీగా నటించారని.. సాంగ్స్ కూడా సినిమాపై భారీ అంచానాలు పెంచేశాయని.. అంచనాలకు తగినట్లుగానే కలెక్షన్లు ఉన్నాయని ట్రేడ్ వర్గాల మాట.

Also Read:  అంతర్యామీ అలసితి అంటూ “పాటగా బతకనా మీ అందరి నోట” అని భువికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..