సోషల్‌ రెస్పాన్సిబులిటీని చాటుకున్న మై హోం గ్రూప్‌.. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ల్లో పెట్‌బాటిల్‌ క్రషర్స్‌ ఏర్పాటు

స్వచ్ఛభారత్‌లో భాగంగా మైహోం గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద.. కర్నూలు జిల్లా...

సోషల్‌ రెస్పాన్సిబులిటీని చాటుకున్న మై హోం గ్రూప్‌.. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ల్లో పెట్‌బాటిల్‌ క్రషర్స్‌ ఏర్పాటు
Follow us

|

Updated on: Dec 09, 2020 | 7:36 AM

స్వచ్ఛభారత్‌లో భాగంగా మైహోం గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద.. కర్నూలు జిల్లా బనగానపల్లె జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పెట్‌ బాటిల్స్‌ క్రషర్‌ మిషన్‌లను పంపిణీ చేసింది.

వ్యర్ధాలపై యుద్ధంలో భాగంగా ఫ్యాక్టరీ యూనిట్‌ హెడ్‌ గురివిరెడ్డి నేతృత్వంలో .. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ఈ మిషన్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల కొందరు ఖాళీ వాటర్‌బాటిళ్లల్లో నీరు నింపి ఫ్రెష్‌ మినరల్‌ వాటర్‌గా రీ సైక్లింగ్‌ చేస్తున్నారు.

దీనిని నివారించేలా మై హోం నడుం బిగించింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెట్‌ బాటిల్స్‌ క్రషర్‌ మిషన్‌లను పంపిణీ చేస్తున్నట్టు మైహోంగ్రూప్‌ తెలిపింది. ఓ మంచి పనికోసం మైహోం గ్రూపు ముందుకు రావడాన్ని అధికారులు అభినందించారు.