ఆ విషయంలో మోదీ, అమిత్‌షా ఆశీస్సులు.. మాకే: విజయసాయి రెడ్డి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరంలో గాని, పీపీఏల అంశంలో గాని వారితో సంప్రదించిన తర్వాతే వైపీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాని దోచుకున్న […]
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరంలో గాని, పీపీఏల అంశంలో గాని వారితో సంప్రదించిన తర్వాతే వైపీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాని దోచుకున్న వారందరినీ చట్టపరిధిలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని విజయసాయి రెడ్డి చెప్పారు. అంతేకాదు కొండవీటి వాగు వల్ల అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. అవినీతి నివారణలో తమ సంకల్పానికి మోదీ, అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.