Moto G84 5G: మిడ్ రేంజ్ బడ్జెట్లో మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. 12జీబీ ర్యామ్, 256 మెమరీతో..
మిడ్ రేంజ్ బడ్జెట్లో వచ్చిన ఈ ఫోన్ పేరు మోటో జీ84 5జీ. ఈ ఫోన్ ఇప్పటికే మన దేశీయ మార్కెట్ అటెన్షన్ ను డ్రా చేసింది. కాగా ఈ ఫోన్ ను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి పెట్టింది. స్మార్ట్ ఫీచర్లతో పాటు ఆకట్టుకొనే హార్డ్ వేర్ తో దీనిని కంపెనీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సేల్ కింద ఈ మోటో జీ84 5జీ పై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

చవకైన ధరలకే అత్యుత్తమ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను అందించే మోటోరోలా.. మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో తీసుకొచ్చింది. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో మంచి పనితీరుని ఈ ఫోన్ కనబరుస్తుందని మోటో ప్రకటించింది. మిడ్ రేంజ్ బడ్జెట్లో వచ్చిన ఈ ఫోన్ పేరు మోటో జీ84 5జీ. ఈ ఫోన్ ఇప్పటికే మన దేశీయ మార్కెట్ అటెన్షన్ ను డ్రా చేసింది. కాగా ఈ ఫోన్ ను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి పెట్టింది. స్మార్ట్ ఫీచర్లతో పాటు ఆకట్టుకొనే హార్డ్ వేర్ తో దీనిని కంపెనీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సేల్ కింద ఈ మోటో జీ84 5జీ పై అందుబాటులో ఉన్న ఆఫర్లు.. ఫ్లిక్ కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్, ఇతర ఆఫర్లు, ఫోన్కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేసన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మోటో జీ84 5జీ ధర, ఆఫర్లు..
ఈ సరికొత్త మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 19,999 ధరతో మన దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఇది వస్తుంది. దీనిని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాక బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం తగ్గింపు రూ. 2,000 వరకూ అందిస్తారు. అలాగే యాక్సిస్ కార్డులపై కొనుగోలు చేస్తే 5శాతం తగ్గింపును అందుకుంటారు.
మోటో జీ84 స్పెసిఫికేషన్లు..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1,300 నిట్ల బ్రైట్ నెస్ ఉంటుంది. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 30వాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది.




ఫోన్ కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంతో మంచి క్వాలిటీతో కూడిన చిత్రాలను తీసుకొనే వీలుంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..